
న్యాల్కల్ మండల కేంద్రంలో నిర్వహించనున్న 359వ పీర్ గయాబ్ సబ్ ఉర్సు షరీఫ్ పోస్టర్‌ను నిర్వాహకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ వేడుకలు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6 వరకు వైభవంగా జరగనున్నాయి. ఉర్సులో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు, గంధం, చాదర్ సమర్పణ, కవ్వాలీ కార్యక్రమాలు ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉర్సును విజయవంతం చేయాలని కోరారు.