MJమార్కెట్: దాడికి తెగబడుతున్న పండ్ల వ్యాపారులు

మొజాంజాహి మార్కెట్ వద్ద పండ్ల వ్యాపారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వినియోగదారుల పట్ల విచక్షణ కోల్పోయి మాట్లాడడమే కాకుండా వచ్చిన వారిని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని పండ్లుకొనేందుకు వచ్చిన వారు వాపోయారు. పండ్ల బేరం చేసే సమయంలో ఎందుకు ఇంత ఎక్కువ అని అడిగినందుకు 70 ఏళ్ల వ్యక్తిని తోసేయడమే కాకుండా అతడి కుమారుడిపైనా దాడికి పాల్పడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.