కేంద్ర బడ్జెట్.. 21వ శతాబ్దంలో ఇదే తొలిసారి..

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం 21వ శతాబ్దంలో దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.