
బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ కంపెనీ ‘అల్మాంట్-కిడ్' సిరప్‌పై TG డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. చిన్నారులకు ఉపయోగించే ఈ సిరప్‌లో విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగం ప్రాణాంతకమంటూ ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేశారు. 'ప్రజలు ఈ సిరప్‌ను వాడటం వెంటనే ఆపేయాలి. మీ దగ్గర ఈ మందు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలి' అని కోరారు.