తాడిపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. బాధితులు వీరే..!

తాడిపత్రిలోని చేనేత కాలనీలో నివాసముంటున్న ఏకాంబరం ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో అద్దెకు ఉన్న జనార్ధన్, జ్యోతి, కుమార్తెలు చరిత, చరణి ప్రమాదంలో చిక్కుకున్నారు. సహాయానికి వచ్చిన ఏకాంబరేశ్వరం, నాగరంగయ్య, రాజేశ్, ప్రశాంత్‌లకు సైతం త్రీవ గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.